ఇనుకొండ సుబ్రహ్మణ్యం ఫెడరేషన్ తొలి అధ్యక్షులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఫెడరేష వ్యవస్థాపక అధ్యక్షులు ఇనుకొండ సుబ్రహ్మణ్యం. వృత్తిరీత్యా తిరుమల తిరుపత కళ్యాణకట్టలో పనిచేస్తూ నమాజసేవకునిగా అనేక సేవా కార్యక్రమాలా నిర్వహించారు. నెల్లూరు జిల్లా(నేడు తిరుపతి జిల్లా) డక్కిలి మండల వడ్లమోపూరు గ్రామానికి చెందిన ఇనుకొండ గురుస్వామి-కన్నెమ్మ దంపతులక సుబ్రహ్మణ్యం 1953 ఏప్రిల్, 15వ తేదిన జన్మించారు. విద్యాపరంగా చదివించి మెట్రిక్యులేషన్ అయినప్పటికీ సమాజం పట్ల ఎంత అవగాహన వుంది. 196 తండ్రి మరణాంతరం 1966న తి.తి.దేవస్థానం కళ్యాణకట్ట అనువంశక సభ్యునిగా ప్రవేశించారు. ఈ కారణంగానే కళ్యాణకట్ట నిర్వహణపై సంపూర్ణ అవగాహ కలిగిన నేతలలో వీరు కూడా ఒకరు. 1987 నుండి 2000 వరకు నాయీబ్రాహ్మణ సంక్షేమ మాసపత్రిక “కళ్యాణి” సంపాదకులుగా, 2001 నుండి ఈనాటి వరణ బగుడు భూమి, బడుగు బలహీన వర్గాల సంక్షేమ మాసపత్రిక సంపాదకునిగా వున్నారు.1973, డిశంబరు 29న తి.తి.దేవస్థానము, కళ్యాణకట్ట మిరాశిదా సంఘమునకు కార్యదర్శిగా పనిచేశారు.
1978 సంవత్సరమున తిరుపతి పట్ట క్షౌర వృత్తిదారుల సంఘమును స్థాపించి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. 192 సంవత్సరమున చిత్తూరు జిల్లా నాయీబ్రాహ్మణ సేవా సంఘమును స్థాపిం సంఘ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. 1986 ఫిబ్రవరి 13, 14 తేదీలలో విశాఖపట్టా నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ సేవా సంఘము మహా సభల సంఘ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 27- 28 తేదీలలో “మంగల్లు ఛలో హైదరాబాదు” లక్షమంది సంఘీయులతో చార్మినార్ నుండి ఆబిడ్స్ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. గృహము వరకు గొప్ప ర్యాలీ నిర్వహించడం తద్వారా రాష్ట్ర ప్రభుత్వం నాయీబ్రాహ్మణ ఆర్ధిక ఫెడరేషన్ సాధించారు. 1988 అగస్టు 4వ తేదీన ప్రభుత్వ సహకార చట్టం ప్రకారం ఆర్థిక ఫెడరేషన్ స్థాపించడము అనంతరం ఫెడరేషన్కు ప్రభుత్వముచే 1989లో చైర్మన్ గా నియమితులై 1992 వరకు పనిచేశారు. ఆనాటి సంఘ మహాసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. మంగల్ల సంక్షేమం కొరకు ప్రకటించిన వాగ్దానముల మేరకు ప్రభుత్వ పథకములకు జీ.ఓ.లను సాధించడము, తద్వారా జిల్లాలందు ప్రభుత్వం సంఘీయులకు గృహములు 27,239 నిర్మించినది. 1992 మార్చి, 27న రాష్ట్ర నాయీబ్రాహ్మణ ఆర్థిక ఫెడరేషన్ కమిటీనకు రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికై 1997 ఫిబ్రవరి వరకు కోనసాగుతూ అభివృద్ధి పథంలో సంస్థను నడిపించారు. గ్రామ పట్టణాలందు ప్రభుత్వ కూడళ్లులో క్షౌరశాలలు నిర్మాణంనకు స్థలములు, గదులు కేటాయిస్తూ, కలెక్టర్ల అధ్యక్షతన నాయీబ్రాహ్మణ సంక్షేమ కమిటీలు జిల్లా స్థాయిలో ఏర్పాటుచేస్తూ కుల వృత్తులకు వృత్తి పన్నులను పినహాయింపు తదితర అనేక పథకాల అమలు జరిపించుటకు జీ.ఓ.లు సాధించారు. సంగీత శిక్షణ గురుకులాలు నాయీబ్రాహ్మణ బిడ్డలు (పిల్లలు) కొరకు నాదస్వరము, డోలు, శిక్షణ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయించారు. 1975 సంవత్సరంలో తి.తి.దేవస్థానం కళ్యాణ అనువంశక విధానంను రద్దుపరచి, కళ్యాణకట్ట నిర్వాహణ బాధ్యతలు తి.తి.దేవస్థానం యాజమాన్యం నిర్వహించే విధముగా నాటి తి.తి.దే. చైర్మన్ చెలికాని అన్నారావు, కార్యనిర్వహణాధికారి, పి.ఎస్.రాజగోపాల్ రాజులతో కళ్యాణకట్ట మిరాశీ ధర్మకర్త పంతులుగారి శివరామయ్యకు మధ్య కుదిరిన ఒక ప్రత్యేక ఒప్పందం ప్రకారం కళ్యాణకట్ట నందు జొరములు నిర్వహించే 400 మంది మంగల్లందరిని 1985 సంవత్సరం నుండి తి.తి.దే. నందు శాశ్వత ఉద్యోగులుగా చేయించడములో ప్రధాన పాత్ర వహించారు.
నిర్వహిస్తూ సమాజానికి సేవలు చేస్తున్న క్షౌరశాల ( సెలూన్స్) లకు సేవా సంఘం . క్షౌరశాలలకు – వృత్తి వన్నుల నుండి మినహాయిస్తూ చట్ట సవరణ చెరకు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు మంగలి కులంవారు అనాధిగా విన్నపం మేరకు వృత్తిపన్నులు, ట్రేడ్ లైసెన్సులు యూజర్ చార్జీలు, ప్రాపర్టీ టాక్స్, చెత్త పన్నులన్నింటిని మినహాయిస్తూ 1990, 2008-2010 సంవత్సరాలలో ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీచేయడానికి కృషిచేశారు.
ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ సేవా సంఘం తరపన 1986లో నాయకత్వం చేపట్టినప్పటి నుండి శ్రమ అనుకోకుండా 23 జిల్లాలు పర్యటించి, సంఘీయుల్లో చైతన్యం తీసుకొచ్చి, అన్ని జిల్లాల్లో మండల, గ్రామ, పట్టణ, జిల్లా, స్థాయి సంఘాలు 978 స్థాపించి సంఘ కార్యక్రమాలు విజయవంతముగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అత్యంత వెనుకబడిన కులాల సమాఖ్య రిజస్టరు సంస్థను స్థాపించి అందులో కార్యదర్శిగా పనిచేయడం. 2018- 19లలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల కార్పొరేషను కమిటీ బోర్డు సభ్యులుగా సేవలందించారు. ఈ విధంగా చెప్పుకొంటుపోతే వీరి గురించే ప్రత్యేకంగా పుస్తకం రాయాల్సి వుంటుంది. సుబ్రహ్మణ్యం తన శ్రీమతి విజయలక్ష్మీతో పాటు తన ఇరువురు కుమార్తెలు, ఒక కుమారునడితో కలిసి ప్రస్తుతం తిరుపతిలో జీవిస్తున్నారు.
