Blog

Latest News
నారీశక్తి’ శ్రీమతి కగ్గనపల్లి రాధాదేవి

నారీశక్తి’ శ్రీమతి కగ్గనపల్లి రాధాదేవి

 

 

భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన నారీశక్తి పురస్కారం పొందిన మహిళారత్నం శ్రీమతి కగ్గనపల్లి రాధాదేవి. భారతదేశం మొత్తంగా ఈ అవార్డు పొందిన నాయీబ్రాహ్మణ సంఘీయురాలే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆవార్డు తీసుకున్న ఏకైక మహిళ అందరికీ గర్వకారణం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో మహిళా క్షురకులకు అవకాశమివ్వాలని ఏడాదిన్నర పాటు పోరాడారు. హైకోర్టు ద్వారా సాధించారు. ఈమె చేసిన కృషికి గాను కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ ‘నారీ శక్తి’ అవార్డు ఎంపిక చేసింది. ఈ అవార్డును 2018వ సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. నుంచి అందుకున్నారు.

 

పుంగనూరుకు చెందిన రాధాదేవి తిరుపతిలో స్థిరపడ్డారు. నాయిబ్రాహ్మణుల తరపున అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో టీటీడీలో మహిళ కురకులకు అవకాశమివ్వాలనే ఉద్దేశ్యంతో ఆమె 2004 డిసెంబరులో పోరాటం ప్రారంభిం తారు, మహిళలకు నెలసరి సమస్య ఉంటుందనే కారణంతో టీటీడీ అందుకు నిరాకరించింది. ఆ ఐదు రోజులుపోనూ మిగిలిన 25 రోజుల పాటు సేవచేసే అవకాశమివ్వాలంటూ ఆమె తన పోరాటాన్ని కొనసాగించారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత 2006 జూన్లో హైకోర్టు నుంచి సానుకూలంగా తీర్పు వచ్చింది. ఆ పోరాట ఫలితంగా అప్పట్నుంచి టీటీడీలో మహిళా క్షురకులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 650 మంది మహిళా క్షురకులుగా వున్నారంటే అందుకు రాధాదేవే కారణం. ఓ వ్యవస్థ గురించి పోరాటం చేసిన ఏకైక మహిళ కావడంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది కేంద్ర

 

మహిళ, శిశు అభివృద్ధి శాఖ రాదాదేవిని ఎంపిక చేశారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో నారీశక్తి పురస్కారాన్ని అందుకు న్నారు. 2006లో ఇయర్ ఆఫ్ ది ఉమెన్. 2016లో విశిష్ట మహిళ, 2017లో శ్రమ శక్తి అవార్డును రా ప్రభుత్వం నుంచి రాధాదేవి తీసుకున్నారు. బీబీసీ చేసిన డాక్యుమెంటరీ ద్వారా స్విట్జర్లాండ్ నుంచీ ఆమె జాతీయ అవార్డు పొందారు.

 

కులవృత్తుల్లో పురుషాధిక్యాన్ని సవాలు చేస్తూ ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన రాధాదేవి 1972, ఫిబ్రవరి 125 తేదీన ఉద్యోగి ఎం. వరదప్ప రామలక్ష్మి దంపతులకు జన్మించారు. లింగవివక్షను ఎదుర్కొని.. ఏపీ మహిళా క్షుర కుల సంఘం అధ్యక్షురాలైన రాధాదేవి.. టైర్డ్ ఆర్మీ తొలుత తితిదే మహిళా క్షురకుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకునే మహిళా భక్తుల కోసం మహిళా క్షురకులనే నియ మించాలనే డిమాండ్ పోరాటం ప్రారంభించారు. ఇదే క్రమంలో చాలా మంది మహిళలు ఈ వృత్తిలోకి వచ్చేందుకు రాధాదేవి శ్రమించారు. పలువురికి శిక్షణనిచ్చారు.

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *