Blog

Latest News
ధూల్ పేట నుండి ఆస్కార్ వేదికగ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ధూల్ పేట నుండి ఆస్కార్ వేదికగ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

 

రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా పాటల, జానపద పాటల గాయకుడు, రచయిత, తెలంగాణ యాసలో మగజాతినే జానపద పాటతో యూట్యూబ్ లో ప్రాచుర్యం పొందారు. సినిమా పాటలతో సింగర్ గా గుర్తింపు వచ్చిన తర్వాత కూడా రాహుల్ కు అంతగా ఆఫర్లు రాలేదు. తెలుగులో ప్రైవేట్ సాంగ్స్ కు అంతగా పాపులారిటీ ఉండదు. మ్యూజిక్ లవర్స్ దాదాపు సినిమా పాటలనే వింటూ ఎంజాయ్ చేస్తారు. కాని ఇలాంటి ప్రైవేట్ సాంగ్స్  ఎక్కువగా ప్రేక్షకులకు అలవాటు చేసిన సింగర్ గా రాహుల్ ను చెప్పుకోవచ్చు. కెరీర్ మొదట్లోనే జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోల సిమాల్లో పాటలు పాడి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. మాస్ సాంగ్స్ పాడాలంటే రాహుల్ వాయిస్ పర్ఫెక్ట్ అని అనుకొనే సంగీత దర్శకులు కూడా లేకపోలేదు. అలా మాస్ సాంగ్స్ కు రాహుల్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.

రాహుల్ 1989, ఆగస్టు 22 న హైదరాబాదులోని ధూల్ పేటలో  మన నాయీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. లయోల హైస్కూల్, నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తి చేశాడు. చిన్నప్పటి నుండి పాటలపై ఉన్న ఇష్టంతో సొంతంగా సాధన చేసేవాడు. వంటగదిలోని వస్తువులతో సంగీతం వాయిస్తూ పాటలు పాడటం గమనించిన రాహుల్ తండ్రి, పండిత్ విఠల్రావు దగ్గరికి పంపించి సంగీతం నేర్పించాడు. సొంతంగా పాటల వీడియోలను రూపొందించి యూట్యూబ్ లో పెట్టేవాడు. వాటికి మంచి స్పందన వచ్చింది.

రాహుల్  20 సంవత్సరాల వయసులో 2009 లో  ‘జోష్’  చిత్రం లో తొలిసారిగా పాడాడు. ఆ తరువాత ‘దమ్ము’  సినిమాలో  ‘వాస్తు బాగుందే’,  ‘రచ్చ’  సినిమాలో  ‘సింగరేణి ఉంది’, ‘ఛల్ మోహన రంగా’ సినిమాలో ‘పెద్దపులి’ వంటి పాటలతో గుర్తింపు పొందాడు. 2018 లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో రాహుల్ పాడిన రంగా రంగా రంగస్థలానా’ పాటకు అత్యంత ప్రజాదరణ లభించింది. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలోని  ‘ఏ మెలికెల్’  పాటలో స్పానిష్ భాగాన్ని పాడాడు. అటు ప్రైవేట్ సాంగ్స్ ఇటు సినిమా పాటలతో రాహుల్ టాలీవుడ్లో బ్యూజి సింగర్ అయిపోయాడు. ఆ సమయంలోనే రాహుల్ సిప్లిగంజ్ ‘బిగ్ బాస్’ రియాల్టీషో నుండి ఆఫర్ వచ్చింది. అలా తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో కాంటెస్టెంట్ గా కనిపించాడు. పక్కింటి కుర్రాడిగా, హైదరాబాద్ అబ్బాయిగా రాహుల్ మాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే తన అభిమానులంతా తనను ‘బిగ్ బాస్ విన్నర్’ గా నిలబెట్టారు. ఇటీవలె రాహుల్ “ఆర్.ఆర్.ఆర్” చిత్రంలో పాడిన “నాటు నాటు” పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రాహుల్ 15 ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. దాదాపు 50 తెలుగు సినిమా పాటలు పాడారు. రాహుల్ సింగర్, సాంగ్స్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఈయనకు యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్ టాక్, పింటరెస్ట్లో లక్షలకొద్ది అభిమానులు ఉన్నారు.

రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. నాటు నాటు పాటను పాడినది ఎవరో కాదు మన నయీ బ్రాహ్మణ ముద్దు బిడ్డ రాహుల్ సిప్లిగంజ్.

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *