Blog

Latest News
రాసమల్ల బాలకిషన్ (బాల కృష్ణ )

రాసమల్ల బాలకిషన్ (బాల కృష్ణ )

నాయీబ్రాహ్మణులలో చైతన్యం రగిలించిన నేతలలో రాసమల్ల బాలకిషన్ గారు ఒక. జాతి గర్వించితగిన కొద్ది మంది సంఘీయులలో బాలకిషన్ గారు ఒకరు . ప్రజలలో చైతన్యం నింపడానికి బాలకిషన్ గారు ఎంతో కృషి చేశారు . బాలకృష్ణ గారు మన నాయీ బ్రాహ్మణుల ముద్దు బిడ్డగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు.

రాసమల్ల బాలకిషన్ (బాల కృష్ణ ) గారు రాసమల్ల కృష్ణయ్య  గారికి జన్మించారు . కప్రాయపల్లి గ్రామం ,భూదాన్ పోచంపల్లి మండలం యాదాద్రి  భువనగిరి జిల్లా ,తెలంగాణ రాష్ట్రం  లో నివసిస్తున్నారు  . బాలకృష్ణ గారు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు . ఇతను క్షౌర వృత్తి చేస్తూ సామాజిక సేవ చేసేవారు . ఇతను 2000 నుండి 2005 వరకు నాయీ బ్రాహ్మణ నాగోలు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు . 2006 నుండి 2008 వరకు రంగారెడ్డి జిల్లా నాయీబ్రాహ్మణ సంఘం  ఉపధ్యక్షుణిగా పనిచేశారు . 2008 నుండి 2012 వరకు నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు . ప్రస్తుతం 2010 నుండి తెలంగాణ రాష్ట్ర నయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నారు . తెలంగాణ ఎం బి సి కో  కన్వీనర్గ 2018 నుండి పని చేస్తున్నారు . 2003 నుండి ఇప్పుడు వరకు టీ. ఆర్. ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యునిగా పనిచేస్తున్నారు .

రాసమల్ల బాలకృష్ణ గారు శ్రీ కల్వకుంట్ల  తారకరామారావు గారికి శిష్యులు . టీ ఆర్ ఎస్ పార్టీ  స్థాపించిన తర్వాత 2003 సం!!లో తెలంగాణ నాయీ బ్రాహ్మణ కమిటీ స్థాపించి ఆనాటి కార్యక్రమానికి ముక్య అతిదిగా మాజీ  నీటిపారుదల శాకమాత్యులు శ్రీ హరీష్ రావు గారిని మరియు మాజీ ఆరోగ్య శాకామాత్యులు లక్ష్మారెడ్డి గారిని ఆహ్వానిచ్చారు ,టీ ఆర్ ఎస్ పార్టీకి అనుభంధంగా పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు  . ప్రతి జిల్లాలో ప్రతి మండలంలను నాయీ బ్రాహ్మణులను చైతన్య పరిచి ఉద్యమం వైపు మల్లేటట్లు చేసారు.

సకల జనుల సమ్మెలో పాల్గొని నాయీ బ్రాహ్మణ సబ్యులందరిని  పాల్గొనపరచి తెలంగాణ వ్యతిరేకులకు క్షవరం చేయము అని శుభ అశుభ కార్యక్రమాలను బహిష్కరింపచేశారు.   ప్రతి క్షౌర శాలను ప్రచార అస్త్రాలుగా చేసుకొని ఉధ్యమమును బలోపేతం చేసి తెలంగాణ రావడానికి తన వంతు కృషి చేశాడు . టీ .ఆర్ .ఎస్ పార్టీ అభ్యర్ధులను  పాల్గొన్న ప్రతి ఎన్నికలలో అతను స్వచ్చందంగా పని చేసి కులస్తులను చైతన్య పరిచి అభ్యర్ధుల విజయానికి రాత్రింబవళ్ళు కృషిచేశారు . వీటితో పాటు అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేయడం జరిగినది . ఎంతో మంది పిల్లలకు చదువుకోడానికి తోడ్పాటునందించడం జరిగినది.

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *