నాసిక చిత్రకారుడు సత్యవోలు రాంబాబు గారు

సమాజంలో కళాకారులకు ఒక ప్రత్యేక గుర్తింపు వుంటుంది. విలక్షణ కళాకారులకు మరింత గుర్తింపు వుంటుంది. అటువంటి విలక్షణ కళాకారుడు సత్యవోలు రాంబాబు. అందరూ కుంచెలతో లేదా పెన్సిల్, పెన్నులతో చిత్రాలు గీస్తే రాంబాబు ముక్కుతో చిత్రాలు గీయడం వీరి ప్రత్యేకత. వేగివాడ గ్రామం , పెదవేగి మండలం,పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాంబాబు గారు 1980, జనవరి 9వ తేదీన జన్మించారు. సాధారణంగా యువకులకు చదువు పూర్తయిన తర్వాత వెంటనే రాజధాని నగరం చేరుకోవాలని మంచి ఉద్యోగం సంపాదించాలని చేతి నిండా సంపాదించాలని ఉంటుంది. రాంబాబు కూడా నగరానికి చేరుకోవాలను కొన్నాడు కాని, ఉద్యోగం కోసం కాదు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని, ఒక చిత్రకారుడు కావాలని, తనలోని చిత్రకళలకు మరింత మెరుగులు దిద్దుకోవాలని, అలా బొమ్మలోనే బతకాలని, భుజాన సంచేసుకుని ఆ సంచిలో రెండు మూడు నాలుగు తెల్లకాగితాలేసుకుని, హైదరాబాద్ రైలెక్కాడు. అనేక సినిమా కష్టాల నడుమన చిత్రకారుడయ్యాడు. అందరూ గీసిన దారిలో కాకుండా బ్రష్లు, పెన్సిళ్ళు వదిలేసి, కొనదెలిన తన ముక్కునే కుంచెగా మలచుకుని, ఎడాపెడా బొమ్మలు గీసిపారేశారు. ముక్కుతో బొమ్మలా? అంటారా? ఆ ముక్కుతోనే రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలామ్ మొదలు అనేక మంది ప్రముఖల చిత్రాలను చిత్రించి ప్రశంసలు అందుకొన్నారు.

ముక్కుతో చిత్రలేఖనం చేయడం గురించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తెలియచేస్తూ తన పేరును నమోదు చేయవలసిందిగా కోరగా అందుకు వారు తిరస్కరించారు. దాంతో వారెవరో తనను గుర్తించడం ఏమిటనే భావనతో ఏకంగా తానే హైదరాబాద్ కేంద్రంగా స్వయం విశ్వగురు వరల్డ్ రికార్డ్సు అనే సంస్థను స్థాపించి, మట్టిలో దాగి వున్న మాణిక్యాలను వెలుగులోకి తీసువచ్చారు.

తన సంస్థ ద్వారా విలక్షణ అంశాలు రికార్డు చేయడమే కాకుండా విశేష ప్రతిభ కలిగినవారికి తెలుగురాష్ట్రాలలోనే కాకుండా జాతీయంగా, అంతరార్జతీయంగా విశ్వగురు ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నారు.
తెలుగు చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళిని అభినందిస్తూ… వారి అంకితభావాన్ని ప్రశంసిస్తూ ఈ చిత్రాన్ని వేసినట్టు తెలిపారు. నటులుగా తమ ప్రతిభతో కోట్లాది ప్రేక్షకులను పొందిన జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌ను అభినందించారు. అంతర్జాతీయంగా ఈ సినిమా విజయవంతం కావాలని… కష్టతరమైన ఇష్టంగా ఈ చిత్రాన్ని చిత్రించినట్లు రాంబాబు తెలిపారు. గవర్నర్ తమిళసై సౌందర్య రాజ్యం గారి దెగ్గర బకూడ అభినందనలను పొందారు .ఇదే కకూకుండా మెగాస్టార్ చిరంజీవి చిత్ర పటాన్ని ఐదు నిమిషాలలో గీసి చిరంజీవి గారి దెగ్గర ప్రశంషాలను అంధుకున్నారు .
మన రాంబాబు గారు 2000 సం!!లో సద్గురు ద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని ఒక కళాశాలను స్థాపించి ఎంతో మంది పేద విద్యార్దులకు మరియు చిత్ర కల నేర్చుకోవాలి అనుకున్న విద్యార్దుల కళను సాకారం చేసుకునేల వా
ళ్ళకు చిత్రకళను నేర్పించారు .అలాగే ఎన్నో రియాలిటీ ప్రోగ్రామ్స్ లో పాల్గొని తన ప్రతిభను ప్రపంచం మొత్తం చూసేలా తన చిత్రకళను గీసి చూపించారు .
ఆర్ ఆర్ ఆర్ తెలుగు చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళిని అభినందిస్తూ… వారి అంకితభావాన్ని ప్రశంసిస్తూ జూనియర్ ఎన్టీఆర్,రాజమౌళి మరియు రాంచరణ్ గార్ల ముగ్గురి మోక చిత్రాలను ఒక్క చిత్రపటంలో వచ్చేలా పదిహేను నిమిషాలు తన ముక్కుతో చిత్రాన్ని గీశారు .నటులుగా తమ ప్రతిభతో కోట్లాది ప్రేక్షకులను పొందిన జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌ను అభినందించారు. అంతర్జాతీయంగా ఈ సినిమా విజయవంతం కావాలని. కష్టతరమైన ఇష్టంగా ఈ చిత్రాన్ని చిత్రించారు .
సంగీతానికి అనుగుణంగా కళాకారిణి నృత్య ప్రదర్శన ఇస్తుంటే ఆ కళాకారిణి వివిద నృత్య బంగిమలను అప్పటికప్పుడే తన నాసి కతో చిత్రీకరించి సత్యవోలు రాంబాబు వందలాది మంది ఆహుతుల ప్రశంషాలను అంధుకున్నారు. కేవలం పద్నాలుగు నిమిషాల వ్యవదిలో ఐదు పూర్తి చిత్రాలను ముక్కుతో గీసి ప్రేక్షకుల కరతాళధ్వనులను అందుకున్నారు . ఇం
కా ఎంతో మంది కళాకారుల చిత్రాలను తన ముక్కుతో గీసి వారి మన్నలను పొందాడు .
