సిద్దవటం యానదయ్య
ఆంధ్రప్రదే
శ్ ప్రభుత్వ నాయీబ్రాహ్మణ అభివృద్ధి-సంక్షేమ కార్పొరేషన్ ప్రధమ ఛైర్మన్ సిద్దవటం యానదయ్య. కడప జిల్లా పట్టపురాయి గ్రామానికి చెందిన సిద్దవటం రామయ్య – పిచ్చమ్మ దంపతులకు జనవరి 17, 1968లో జన్మించారు. ఆ తర్వాత కడపలో స్థిరపడ్డారు. హైస్కూల్, కాలేజీ చదివే రోజులలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆప్ ఇండియాలో క్రియశీలకంగా పనిచేశారు. ఆనాటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. రాజకీయాలలోకి రాకపూర్వం నేతాజీ యువజన సేవా సంఘం ప్రారంభించి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చేరడంతోపాటు పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. వై.ఎస్. జగన్మోహనరెడ్డి పార్లమెంటుకు పోటీ చేసిన సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చిన ఏర్పాటు చేసిన బీసీ కులాల కార్పొరేషన్ల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ప్రధమ ఛైర్మన్ గా 2021లో నియమితులయ్యారు. ఆ తర్వాత మరలా 2023వ సంవత్సరంలో అదే పదవిని కొనసాగిస్తూ మరల ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ బార్బర్షిపు నిర్వహకులకు అందిస్తున్న 10 వేల రూపాయాల ఆర్థిక సాయాన్ని ప్రతివారికి అందేలా చేయడంతోపాటు బార్బర్ షాపులకు నెలకి 150 యూనిట్ల విద్యుత్ అందించే విధంగా ప్రభుత్వపరంగా కృషిచేసినట్టు యానదయ్య తెలిపారు. అదేవిధంగా తాను “మంగలి, మంగలోడ, మంగలిది” అనే పదాలు వాడకుండా ముఖ్యమంత్రికి వివరించి ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు వచ్చేలా కృషిచేసినట్టు తెలిపారు.
