Blog

Latest News
పొలిటికల్ కార్టూనిస్టు నారు

పొలిటికల్ కార్టూనిస్టు నారు

వ్యంగ్యచిత్రాలు గీయడం ఒక విచిత్రమైన కళ. చిత్రం చూస్తే గీతలు వంకర టింకర్లగా వుంటాయి, కాని గీసిన చిత్రం ఎవరిదో అర్ధంకావడమే కాకుండా చూడగానే నవ్వు వస్తుంది. ఇటువంటి చిత్రాలను పత్రికలలో గీసే వారిని పాలిటకల్ కార్టూనిస్టులు అంటారు. ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల గురించి పత్రికలను ఆసాంతం చదవాల్సి వుంటుంది. అంత చదివినా ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కీలక అంశం గుర్తించడం చాలా కష్టం. కాని, పత్రిక చదవకుండా పత్రిక మొదటి పేజీలో కనిపించే వ్యంగచిత్రం (కార్టూన్) చూస్తే చాలు ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి తీరు ఏమిటో ఇట్టే అర్ధం అవుతుంది. ఒక పత్రికలో కార్టూనిస్టుగా రాణించాలంటే ఎంతో సృజనాత్మకత వుండాలి. కార్టూనిస్టుకు గీతే కాదు రాత కూడా తెలియాలి. సమాజాన్ని ఆకలింపు చేసుకలిగినవారు మాత్రమే మంచి కార్టూనిస్టుగా గుర్తింపు పొందుతారు. అటువంటి మంచి గుర్తింపు పొందిన కాళాకారుడు “నారు” ఇది తన పెన్ లేదా బ్రష్ పేరు మాత్రమే. అసలు పేరు మంగళ నారాయణ. పుట్టింది, పెరిగింది నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో. అతి సాధారణ కుటుంబీకులైన సాయిలు-సావిత్రమ్మ దంపతులకు 1966, జులై 18వ తేదీన జన్మించారు. పాలిటెక్నిక్ చదువుతూ డ్రాయింగ్పై వున్న మక్కువతో డ్రాయింగ్ టీచర్ కోర్సు చదివారు. ఆ తర్వాత ఇతరత్ర అవకాశాలు వున్నప్పటికీ కార్టూన్ కళపై ఉన్న మక్కువతో ఈ రంగాన్నే వృత్తిగా స్వీకరించారు.

నారులోని కళాకారుడిని గుర్తించిన తెలుగుదేశంపార్టీకి చెందిన బాన్సువాడ శాసన సభ్యులు ఎస్.వి.ఎల్. నరసింహరావు 1986లో హైదరాబాద్ తీసుకు వెళ్ళి నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు పరిచయం చేశారు. కొంతకాలం శాసన సభ్యునిగా సహాయకునిగా కూడా పనిచేశారు. ఆనాడు నారు కార్టూన్లు చూసి నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామా రావు ‘శభాష్ పైకి వస్తావు బ్రదర్’ అని దీవించారు. ఎన్.టి.రామారావు గండి పేట, తెలుగువిజయంలో పని చేశారు. అంతే కాకుండా ఎన్టీఆర్ నారుతో ప్రభుత్వం పార్టీకి అవసరమైన అనేక చిత్రాలు గీయించారు. మండల వ్యవస్థ ప్రారంభమైన తొలినాళ్లలో మండలాల మ్యాప్లు గీయడం సహకరించారు. ఎన్.టి.రామారావుతోపాటు దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడి ప్రశంసలు పొందారు. పొలిటికల్ కార్టూన్లు గీయడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నారు ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, కృష్ణాపత్రిక వంటి ప్రముఖ పత్రికలలో పనిచేశారు. ఎంతో సామాజిక స్పృహకలిగిన నారు 1994లో బిఎస్పి అగ్రనేత కాన్షీరామ్ హైదరాబాద్ విచ్చేసినప్పుడు స్వాగతం చెబుతూ వాల్పోస్టర్ను రూపొందించారు. బహుజన మేధావులు నిర్వహించిన నలుపు-తెలుపు పత్రికలో ఆర్టిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం సూర్య పత్రికలో చీఫ్ కార్టూనిస్టుగా వున్నారు. నారు 1998 లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కార్టునిస్టుగా ‘ఇందిరా గాంధీ అవార్డును పొందారు. 2020, జనవరి నెలలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఉత్తమ కార్టూనిస్టుగా గుర్తించి సన్మానం చేసింది. 2023, మార్చి 29వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కార్టూన్ విభాగంలో కీర్తి పురస్కారం పొందారు. వివిధ జాతీయ పత్రికలు పునర్ముద్రణకు ‘నారు’ కార్టూన్లు తీసుకోవడం మనందరం గర్వించాల్సిన విషయం ప్రగతిశీల దృక్పధంతో చిత్ర రచన చేస్తున్న చిత్రకారులో ‘నారు’ ప్రస్తుతం హైదరాబాద్, రామ్నగర్లో నివాసం ఉంటున్నారు. వాట్అప్ గ్రూప్ ద్వారా తెలుగు రాష్ట్రాలలోని సంఘీయులను ఒకరి కొకరిని పరిచయం చేయడం కాకుండా భారతదేశ వ్యాప్తంగా వివిధ వృత్తులు, వ్యాపారాలలో ప్రఖ్యాతి గాంచిన సంఘీయులను పరిచయం చేయడం వీరి ప్రత్యేకత. వీరి సతీమణి హరిపుష్ప ఆర్టీసీలో పనిచేస్తున్నారు. వీరి ఇరువురు కుమారులు ఇంజనీర్లే. పెద్దబ్బాయి హరీష్ అమెరికాలో స్థిరపడగా, రెండో కుమారుడు కార్తీక్ హైదరాబాద్లో స్థిరపడ్డారు.

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *