Blog

Latest News
తుమ్మిడి బ్రదర్స్

తుమ్మిడి బ్రదర్స్

రామ్ కుమార్ 

రాజమండ్రి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే సంస్థలలో ఒకటి తుమ్మిడి బ్రదర్స్. రాష్ట్రంలోని ప్రముఖ వస్త్రవ్యాపార సంస్థ జాబితాలో ముందుందే సంస్థలలో తుమ్మిడి బ్రదర్స్. రాజమండ్రి కోటగుమ్మంలో, విజయవాడ బీసెంట్ రోడ్డులో, విశాఖపట్నం జగదాంబ సెంటర్లలో తుమ్మిడి బ్రదర్స్ వస్త్రానిలయాలు ఆధునిక కేంద్రాలు. ప్రతిష్టాత్మకంగా కనిపించే అటువంటి తుమ్మిడి బ్రదర్స్లో అగ్రజుడు తుమ్మిడి రామ్కమార్ 1955 సంవత్సరంలో తుమ్మిడి పుల్లయ్య-జానకమ్మ, దంపతులకు రాజమండ్రిలో జన్మించారు. సామాన్య కుటువంబంలో జన్మించినప్పటికీ స్వశక్తితో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. తన తమ్ములతో కలసి రాజమండ్రితోపాటు విజయవాడ, విశాఖపట్నంలో వస్త్ర సంస్థలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో నివసిస్తున్నారు. వృత్తి రీత్యా వ్యాపారవేత్త అయినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు. రాజమండ్రి కేంద్రంగా తుమ్మిడి ఛారిటబుల్ ట్రస్టును ప్రారంభించి అనేక విద్యా సంస్థలకు సాయం అందించారు. రాజమండ్రి కన్స్యూమర్ అసోసియేన్, గురజాడ ఆర్ట్స్ అకాడమీ, సిటిజెన్ వేల్ఫేర్ అసోసియేషన్, త్రివేణి సమ్మేళనం, రాజమండ్రి లయన్స్ క్లబ్ వంటి సంస్థలకు అధ్యక్షునిగాను, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్సు, రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్, రిటైల్ క్లాత్ మర్చంట్ అసోసియేషన్, త్యాగరాజసమితి ఆరోధనోత్సవ సమితి వంటి సంస్థలకు ఉపాధ్యక్షునిగా, రెడ్ క్రాస్ సోసైటికి జీవితకాల సభ్యునిగా, ఆల్ ఇండియా రేడియో, సెంట్రల్ జైల్ సలహా సంఘ సభ్యునిగా, రాజమండ్రి కళాదర్బార్, ఆదర్శ ప్రెండ్స్ సర్కిల్కు చీఫ్ అడ్వజర్ పలు హెూదాలలో పనిచేయడంతోపాటు రాజమండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కమిటీ అధ్యక్షునిగా, పోస్టల్ శాఖ కమిటీ సభ్యునిగా, హిందూ ధర్మరక్షణ సవితి తూ.గో.జిల్లా అధ్యక్షునిగా సేవలందించారు. వాణిజ్య పరంగా ఎంతో బీజీగా వున్నప్పటికీ సంఘ కార్యక్రమాలకు కూడా పాల్గొనడం వీరి ప్రత్యేకత. ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత తొలిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షునిగా వున్నారు. సంక్షేమ సంఘం నిర్వహించిన అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. సంఘానికి ప్రస్తుతం గౌరవ అధ్యక్షునిగా వున్నారు. రాజమండ్రిలో వ్యాపార పరంగా రాణించడమే కాకుండా సంగీత, సాహిత్య రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకొన్నారు.

తుమ్మిడి విజయ్ కుమార్ 

తుమ్మిడి బ్రదర్స్ లో రెండవ వ్యక్తి తుమ్మిడి విజయకుమార్. 1959, ఆగస్టు 2వ తేదీన రాజమండ్రిలో జన్మించిన విజయకుమార్ హెూల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగణ్యుడు. మంచి క్రమశిక్షణతో తుమ్మిడి ఛారిటబుల్ ట్రస్టు డైరక్టర్గా లయన్స్ క్లబ్ రాజమండ్రికి అధ్యక్షుడిగా జోనల్ చైర్మన్గా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం రాజమండ్రిలో హెూల్సేల్ వస్త్రవ్యాపారం కొనసాగిస్తున్నారు.

తుమ్మిడి అరుణ్ కుమార్

రాజమండ్రికి చెందిన తుమ్మిడి అరుణ్ కుమార్ (బాబ్లీ) తుమ్మిడి బ్రదర్స్ వస్త్ర వ్యాపార సంస్థ భాగస్వామ్య సోదరులలో ఒకరు. తుమ్మిడి పుల్లయ్య – జానకిమ్మ దంపతులకు 1965, ఫిబ్రవరి 9వ తేదీన జన్మించారు. వ్యాపారంలో క్రియాశీలకంగా వుంటూనే అనేక సేవాల కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తుమ్మిడి చారిటబుల్ ట్రస్టు సభ్యునిగా అనేక సంస్థలకు ఆర్థిక సాయం చేయడంతోపాటు స్వయంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థను ప్రారంభించడంతోపాటు గౌరవ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఈ సంస్థ తరపున వృద్ధాశ్రమం, ఆనాధ ఆశ్రమాలకు సేవలందిస్తున్నారు. రాజమండ్రి లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించడంతోపాటు విన్నూంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సంఘపరంగా ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘంలో రాష్ట్ర కార్యదర్శిగా, ప్రత్యేక సలహాదారునిగా సేవలందించారు.

తుమ్మిడి బుల్లి గోవిందరావు

జానకిమ్మ దంపతులకు 1969, మార్చి 21వ తేదీన జన్మించారు. అధ్యాత్మిక చింతన కలిగిన బుల్లి గోవింద్ విశ్వహిందూ పరిషత్ సభ్యునిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తల్లిదండ్రులు మాటవింటూ వారిని గౌరవించేవారు. ఎప్పుడూ ఉన్నతంగానే జీవిస్తారని వీరి విశ్వాసం. సేవా కార్యక్రమాలు ప్రచారు. కోసం కాదని, కుడిచేతితో ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియకూడదని మా అమ్మ చెప్పిన మాట తనకు ఆదర్శం అని చెబుతారు.

తుమ్మిడి శ్రీనివాస్

తుమ్మడి బ్రదర్స్లో చివరివాడు తుమ్మిడి శ్రీనివాస్ 1975, జూన్ తన తేదీన ఆంధ్రద్రేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. ప్రస్తుతం విజయవాడలో నివాసం వుంటూ బీసెంట్ రోడ్డులో తుమ్మిడి బ్రదర్స్ పేరిట వస్త్ర దుకాణం. నిర్వహిస్తున్నారు. తుమ్మిడి ఛారిటబుల్ ట్రస్టు సభ్యునిగా అనేక సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. విజయవాడ నగరంలో కమ్యూనిటీ పరమైన కార్య క్రమాలలో చురుకుగా పాల్గొనడంతోపాటు సంఘ కార్యక్రమాలకు ఇతోధికంగా సాయం అందిస్తున్నారు.

 

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *