Blog

Latest News
ఎం.లింగం నాయీ న్యాయవాది

ఎం.లింగం నాయీ న్యాయవాది

హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ప్రాంతంలో సంఘీయుల సమస్యలపై పనిచేస్తున్న నాయకులలో ఎం. లింగం నాయీ ఒకరు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన లింగం నాయీ 1961, ఆగస్టు 25వ తేదీన ఎం. నారాయణ దంపతులకు, రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద మండలం, చికోడ్ గ్రామంలో జన్మించారు. బి.ఎస్స్సీ అనంతరం ఎల్ఎల్బీ పూర్తిచేసి న్యాయవాదిగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ రావడానికి ముందు ముస్తాబాద్ మండలం తెలుగుదేశంపార్టీ అధ్యక్షునిగా రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్ విచ్చేచేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా 1988 నుంచి 2014 వరకు పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో వున్న తొమ్మిది నాయీబ్రాహ్మణ సంఘాలను ఒక వేదికపై తీసుకువచ్చి తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్య వేదిక ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. న్యాయవాదిగా కూడా సిటీలో ప్రత్యేక గుర్తింపు చెచ్చుకొన్నారు. సిటీ సివి కోర్టుల బార్ అధ్యక్షునిగా 2021-2022వ సంవత్సరానికి ఎన్నికయ్యారు. 75 ఏళ చరిత్రలో బార్ అసోసియేషన్కు తొలిగా బీసీ సామాజికవర్గం నుంచి ఎన్నికై= ఘనతను దక్కించుకొన్నారు. ప్రస్తుతం బారత్ రాష్ట్ర సమితి లీగల్ సెల్కు సెక్రటరీగా పనిచేస్తున్నారు.

Share This Post

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *