ఎస్. సారంగపాణి

శ్రీ ఎస్. సారంగపాణి గారు వరంగల్ జిల్లాలోని పాలకుర్తి గ్రామంలో 19, అక్టోబ
ర్ 1956లో జన్మించారు. సమకాలీన సామాజిక వ్యవస్థలో ప్రముఖ ఆయుర్వే
ద వైద్యులుగా ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ సూర్యపల్లి సారంగపాణి నాయీబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు.
జీవితంలో ఎత్తుపల్లాలు ఎక్కుతూ, దిగుతూ అంచెలంచెలుగా ఎదిగారు. జీవితంలో డాక్టర్ కావాలని బలమైన కోరికతో అనంత లక్ష్మి ప్ర
భుత్వ ఆయుర్వేద కళాశాల(వరంగల్)లో వైద్య విద్యను అభ్యసించి ఆఖరి సంవత్సరము పరీక్షలలో కాకతీయ యూనివర్సిటీ టాపర్ గా నిలిచి 1981లో ఆనాటి గవర్నర్ కేసీ అబ్రహంగారి చేతుల మీదుగా తొలి బంగారు పతకం అందుకున్నారు. ఆయుర్వేదంలో ఉన్నత విద్యాభ్యాసం కొరకు డాక్టర్ బి.ఆర్.కె.ఆర్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్ నందు ఎండి శల్యతంతము(సర్జరీ)లో మొదటి బ్యాచ్ విద్యార్ధిగా చేరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1986లో పట్టా పుచ్చుకున్నారు.
ఏపీపీఎస్సీ ద్వారా 1986లో జరిగిన నియామకాల్లో ఫిఫ్త్ జోన్ టాపర్‌గా ఎంపికై మెడికల్ ఆఫీసర్‌గా ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు గ్రామ డిస్పెన్సరీలో జాయిన్ అయ్యారు. ఆదివాసులు ఎక్కువగా నివసించే మారుమూల గ్రామము. వీరికి వైద్యం, రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. వర్షాకాలంలో 40 కిలోమీటర్లు అడవిలో నుండి నడిచి గాని ఎడ్లబండిలో గాని ప్రయాణించాల్సి వచ్చేది. మరో మార్గం లేదు. డాక్టర్ సారంగపాణి ఎం.డి. చదివినప్పటికీ మూడు సంవత్సరాలు మారుమూల గ్రామంలో జనంతో మమేకమై వైద్య సేవలు అందించారు. హైదరాబాద్ ఆయుర్వేద కళాశాలలో 1989లో లెక్చరర్‌గా ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి, చివరకు అదే కళాశాల ప్రిన్సిపల్‌గా 2014లో పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ సర్వీసులో వీరు ఏపీ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ వివిధ హెూదాలలో 18 సంవత్సరములు పనిచేయడంతోపాటు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర మెడికల్
ఆఫీసర్స్ అసోసియేషన్‌లో తొలి అధ్యక్షుడిగా సేవలందించారు.
డాక్టర్ సారంగపాణి జాతీయ అంతర్జాతీయ సదస్సులలో తన చికిత్స Minimal invasive para-surgical and surgi cal procedure ບ ພໍ ງ. Ano rectal diseases Piles, fistula, fissure » Pilonidal sinus í ð ឯᾔ ప్రత్యేకత సాధించారు. వీరు వారణాశిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి మరియు డాక్టర్ ఎన్.టి.రామారావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (విజయవాడ)లకు Board of studies మెంబర్‌గా పనిచేశారు. అంతేకాకుండా వారణాశిలోని బనారస్ హిందూ విశ్వవి

ద్యాలయానికి రిక్రూట్మెంట్ ఎక్స్‌ఫర్డ్ కమిటీ సభ్యునిగా కూడా పనిచేశారు.
వీరి పరిశోధనలు చికిత్స అనుభవమునకు గుర్తింపుగా భారత ప్రభుత్వము 28 Member, Central Council of Indian Medicine(CCIM) నామినేట్ చేసినది. ఇది ఆయుర్వేదం యొక్క అత్యున్నత విధాన నిర్ణాయక జాతీయ సంస్థ. ఈ సంస్థకు ఎడ్యుకేషన్ కమిటీ వైస్ చైర్మన్ గా కూడా సేవలందించారు. తన 5 సంవత్సరాల కాలపరిమితిలో వైద్య విద్యలో ఎన్నో సంస్కరణలకు, ఆధునీకరణకు శ్రీకారం చెట్టారు. “ధన్వంతరి పురస్కారము” (చికిత్స సేవా సద్భావన శిరోమణి సన్మానం), “వైద్యశ్రీ” పురస్కారంతోపాటు తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ కాకర్ల సుబ్బారావు వంటి ప్రముఖల చేతుల మీదుగా అనేక పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో “సాయి భరద్వాజ అడ్వాన్స్డ్ ఆయుర్వేద ఆసుపత్రి” నెలకొల్పి వైద్యసేవలు అందిస్తున్నారు.
